![]() |
![]() |

ఢీ సీజన్ 16 ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. గత వారం టీం ఏ కొరియోగ్రాఫర్స్ అలాగే వాళ్ళ లీడర్స్ ని చూసాం. ఇక ఇప్పుడు టీమ్ బి నుంచి మరో నలుగురు కొరియోగ్రాఫర్స్ తమ కంటెస్టెంట్స్ తో రాబోతున్నారు. అందులో కృష్ణ మాస్టర్, సందీప్ మాస్టర్, ప్రభుదేవా మాస్టర్, సాయి మాస్టర్ కనిపించారు. ఈ నలుగురు నాలుగు ప్రాంతాలను ..అంటే కృష్ణ, కరీంనగర్, రాయలసీమ, కోనసీమను రిప్రెజంట్ చేయబోతున్నారు.
ఇక ఈ షోలోకి గెటప్ శీను బ్లూ కలర్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చి కాసేపు ఆదితో కలిసి ఫన్ క్రియేట్ చేసాడు. సిరి హన్మంత్, సింగర్ మధుప్రియ వచ్చారు. ఇక కంటెస్టెంట్ భూమిక చేసిన "రారా సామి" డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. భూమిక అనే పేరు చూసేసరికి ఆది, గెటప్ శీను కలిసి ఒక్కడు మూవీలోని కొండారెడ్డిగా చేసిన ప్రకాష్ రాజ్ డైలాగ్స్ చెప్పుకుంటూ బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక ఈమె చేసిన సాంగ్ కి శేఖర్ మాష్టర్, దీపికా పిల్లి కూడా స్టేజి మీదకు వెళ్లి స్టెప్పులేశారు.
ఈ షో ప్రోమో ఎండింగ్ లో చైతన్య మాస్టర్ ఫోటోని చూపించారు. "మనందరి ఫేవరేట్ వ్యక్తి తన లాస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఈ స్టేజి మీద చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రభుదేవాని కొరియోగ్రాఫర్ గా ఈ స్టేజి మీద చూడాలి అని కోరుకున్నారు. ఈరోజు ఆ కలను, ఆయన విష్ ని నిజం చేసాడు ప్రభుదేవా" అని చెప్పాడు హోస్ట్ ప్రదీప్. ఆయన ఫోటో చూసేసరికి ప్రభుదేవా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఐతే ఈ టీం బికి సంబంధించి ఎవరెవరు లీడర్స్ ఉండబోతున్నారు...వాళ్ళ టీం పేర్లు ఏమిటి అనే విషయాలను ప్రస్తుతానికి చూపించలేదు.
![]() |
![]() |